ఆ రెండూ తప్పే : యార్లగడ్డ
ఒకే దేశం, ఒకే భాషా విధానం అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. అలా కాకుండా త్రిభాషా సూత్రాన్ని పాటించాలని కోరారు. రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం ఎంత తప్పో, అలాగే హిందీని నేర్చుకోమనడం కూడా అంతే తప్పన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దక్షిణాది భాషలను నేర్పించాలని సూచించారు. అసెంబ్లీ, సచివాలయంతో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కలిసి కోరతానని వెల్లడించారు.













