జూన్ 21న యోగా డే ఎందుకో తెలుసా?
ఏడాదిలోనే అత్యంత ఎక్కువగా పగటికాలం ఉండే రోజుగా జూన్ 21కి పేరుంది. యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈసారి జూన్ 21కి మరో ప్రత్యేకతగా కూడా ఉంది. ఇవాళ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 13 గంటల 7నిమిషాల సమయం అవడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల 34 నిమిషాలకే సూర్యోదయం కావడం విశేషం. మనదేశంలో తొలి సూర్యోదయం మధప్రదేశ్లోని ఉజ్జయినిలో జరగ్గా, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి కృష్ణా జిల్లా గుడివాడలో తొలిసారిగా తెల్లవారింది. అయితే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో మబ్బులు కమ్ముకొని సూర్యుడు కనిపించలేదు. కాని తెల్లవారడం మాత్రం 5.43 నిమిషాలకు జరిగింది.













