తెలంగాణా రాష్ట్రానికి 20 అంబులెన్స్ లు, 4,000 పీపీఈ కిట్లు మరియు 1,50,000 రోజువారీ భోజనాలను విరాళంగా అందించిన జీ ఎంటర్ టైన్ మెంట్
ఎంటర్ టైన్ మెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీ) , కోవిడ్ –19కు వ్యతిరేకంగా తమ జాతీయ కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అధికారికంగా 20 అంబులెన్స్ లు, 4,000 పీపీఈ కిట్లును తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి నేడు తెలంగాణా రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు పట్టణ వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కెటీ రామారావు సమక్షంలో అందించడం ద్వారా కోవిడ్ –19కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేసింది.
ఆరోగ్య సంరక్షణ ఉపశమనానికి మించి ఈ కంపెనీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ తో చేసుకున్న భాగస్వామ్యంపై ఆధారపడి 1,50,000 రోజువారీ భోజనాలను రాష్ట్ర వ్యాప్తంగా వలసకార్మికులు, రోజువారీ కూలీలకు అందించింది.
ఈ కంపెనీ తాము కేటాయించుకున్న సీఎస్ ఆర్ బడ్జెట్ (కోవిడ్ –19తో పోరాటం చేసేందుకు)ను తెలంగాణా రాష్ట్రంలో ఈ దిగువ అవసరాలను తీర్చడానికి వినియోగించింది.
అంబులెన్స్ లు – రాష్ట్రానికి 20 అంబులెన్స్ లు విరాళంగా అందించింది
పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ) కిట్స్ – రాష్ట్రానికి 4వేల కిట్స్ ను విరాళంగా అందించింది
రోజువారీ భోజనాలు ◌ః వలసకార్మికులు మరియు రోజువారీ కూలీలకు 1,50,000 రోజువారీ భోజనాలను అందించింది
ఈ కార్యక్రమం గురించి శ్రీ పునీత్ గోయెంకా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , జీ మాట్లాడుతూ ‘‘మొత్తంమ్మీద ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించి, కోవిడ్ –19తో జరుగుతున్న పోరాటంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి బలీయమైన మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉంది. ప్రస్తుత మహమ్మారి వేళ రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో తామందించే ఆరోగ్యసంరక్షణ అవసరాలు, ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రానికి మరింత దోహదపడతాయని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
తెలంగాణా రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు పట్టణ వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కెటీ రామారావు మాట్లాడుతూ ‘‘ఈ మహమ్మారి వేళ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటుగా రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఆరోగ్య భద్రత పట్ల భరోసా కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. కోవిడ్ –19 ప్రతిస్పందన మరియు ఉపశమనం కోసం మద్దతు అవసరమైన సమయంలో సహకరించినందుకు శ్రీ పునీత్ గోయెంకా మరియు జీ యాజమాన్యానికి ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
కోవిడ్ –19కు వ్యతిరేకంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు తమ దేశవ్యాప్త సీఎస్ ఆర్ డ్రైవ్ లో భాగంగా, 240కు పైగా అంబులెన్స్ లు, 46వేల పీపీఈ కిట్లు, 90కు పైగా ఆక్సిజన్ హ్యుమిడిఫయర్లు, 6లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ కట్టుబడింది. ఈ విరాళాన్ని ఈ జాతీయ స్థాయి సీఎస్ ఆర్ డ్రైవ్ లో భాగంగా తెలంగాణా రాష్ట్రానికి అందించారు.
జాతీయ స్ధాయిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీలో పనిచేస్తున్న 5వేల మంది రోజువారీ కూలీలకు కంపెనీ ఆర్థికంగా మద్దతునందించింది. అంతేకాకుండా, 3400 మందికి పైగా ఉద్యోగులు పీఎం కేర్స్ ఫండ్ కు తోడ్పాటునందించారు. ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ జత చేసి దానిని పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా అందించింది.
బాధ్యతాయుతమైన మీడియా మరియు ఎంటర్ టైన్ మెంట్ సంస్ధగా, కోవిడ్ –19తో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన బలమైన చర్యలను జీ కొనసాగిస్తుంది.













