బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయా కండువా కప్పుకొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున జహీరాబాద్ పార్లమెంట్ నియోజకర్గం నుంచి పాటిల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.