కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేరిందా?
కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేరిందా? అని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగిత్యాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నల్లా తిప్పితే మంచినీళ్లు కాదు లిక్కర్ వస్తోందన్నారు. మూడు పార్టీలు రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. మతం పేరుతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగని వీళ్లా పార్టీల అధ్యక్షులు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో అసలు కేటీఆర్ ఎవడని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌కు స్థాయి ఎక్కడిదని నిలదీశారు. తనకు కేటీఆర్‌తో పొలికేంటని ప్రశ్నించారు. బీజేపీనే కేసీఆర్ తనకు ప్రత్యామ్నాయం అనుకుంటున్నాడు. రాజకీయాలంటే డబ్బులతో కొనడం అనుకుంటున్నారు అని అన్నారు.













