పాదయాత్రలో కల్లు తాగిన వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి రాజకీయాలు కొత్తరంగు పులుముకుంటున్నాయి. ఇటు షర్మిల, అటు రేవంత్ రెడ్డిల పాదయాత్రలు హుషారుగా సాగుతున్నాయి. పాలకుమర్తి మండలం శాతపురం నుంచి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సాగింది. వైఎస్ షర్మిల పాదయాత్రలో కల్లు తాగడం ఆసక్తికరంగా మారింది. లక్ష్మీనారాయణ పురం స్టేజి దగ్గర కల్లు గీత కార్మికుడి కోరిక మేరకు తాటికల్లు నీరా రుచి చూశారు షర్మిల. కల్లు తాగడం తనకు అలవాటు లేదని, కానీ గీత కార్మికుడు కోరిక మేరకు కొద్దిగా రుచి చూసినట్లు షర్మిల తెలిపారు. వారి సమస్యలు విన్న అనంతరం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.













