వైఎస్ షర్మిలకు పెద్ద షాక్… ఆ పార్టీ కీలక నేత
వైఎస్ఆర్టీపి అధినాయుకురాలు షర్మిలకు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఇందిరాశోభన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. కాగా, రాజీనామాకు సంబందించి పూర్తి వివరాలను లేఖలో వివరించారు. ఇందిరాశోభన్ పార్టీలో చేరినప్పట్నుంటి వైఎస్ఆర్టిపి తరపున పెట్టే సభలు, సమావేశాలు, డిబేట్స్‌లో కీలకంగా వ్యవహరించింది. అదే విధంగా వైఎస్ఆర్టీపి పార్టీ ఆవిర్భావం రోజున ఇందిరా శోభన్ స్వీచ్ కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపింది. అయితే ఆంధ్రాకు చెందిన షర్మిలక్క వైఎస్ఆర్టీపీలో ఉండకూడదని అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తాను పార్టీకి రాజీనామా చేశానని ఇందిరా వెల్లడించారు.













