ఆ హామీలేవీ నెరవేర్చలేదు…సీఎం కేసీఆర్ పై
పేదలకు డబుల్బెడ్రూం, ఇంటికో ఉద్యోగం, ఎస్సీలకు మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, ఉచితంగా ఎరువులు, 57ఏళ్లకే ఫించన్, ముస్లిం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవి నెరవేరలేదని వైఎస్ఆర్టీపీ అద్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ప్రజల కోసం పనిచేయండి, చేసిన తప్పులను సరిదిద్దుకోకుంటే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని అన్నారు. హనుమకొండ జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచితవిద్య, ఫీజు రీయింబర్స్మెంట్ ఊసేలేదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో పెట్టారని విమర్శించారు. సీఎం కుటుంబం లోని ఐదుగురికి పదవులిచ్చుకోవడమే సంక్షేమ పాలనా అన్ని ఎద్దేవా చేశారు. తొలిసారి అధికారం లోకి వచ్చినప్పుడు 65 వేల ఉద్యోగాలు భర్తి చేసిన బీఆర్ఎస్ రెండోసారి పగ్గాలు చేపట్టాక 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను పక్కనబెట్టి నిరుద్యోగం లేదని బుకాయిస్తోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే యువకుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.













