కేసీఆర్ వాఖ్యలపై ఏం సమాధానం చెబుతారు?.. సజ్జలకు షర్మిల
ప్రజల కోసమే తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అన్ని పార్టీలో దొంగలుంటారని, కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో సంబంధం లేదని గతంలో సజ్జల అన్నారని, ఇప్పుడే ఏ సంబంధం ఉందని తన గురించి ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, విద్యుత్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు? సజ్జల గారూ ముందు మీ కథ మీరు చూసుకోండి అని షర్మిల ఎద్దేవా చేశారు.













