తన జీవితం తెలంగాణకే అంకితం
తన జీవితం తెలంగాణకే అంకితమని వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన దగాకోరు కేసీఆర్ అన్నారు. కూలి నాలి చేసి చదివిస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చస్తే ఉద్యోగాలు తగ్గుతాయని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పండిరచాలనే హక్కు రైతుకే లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇచ్చేది రూ.5 వేలు, పట్టుకునేది రూ.20 వేలు అన్నారు. వ్యవసాయంలో అన్ని పథకాలు తీసేసి రూ.5 వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు.













