వైఎస్సార్ బతికుంటే వరంగల్ దూసుకుపోయేది : షర్మిళ
వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే వరంగల్ అభివృద్ధిలో దూసుకెళ్లేదని వైఎస్ శర్మిళ అభిప్రాయపడ్డారు. వరంగల్ ఏకశిలా నగరమని, సాంస్కృతిక రాజధాని అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను వరంగల్ నలుదిశలా చాటి చెప్పిందని గుర్తు చేశారు. వరంగల్‌కు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. రాణి రుద్రమ ఈ భూమిపైనే జన్మించారని, కాళోజీ కూడా ఇదే గడ్డపై పుట్టారని గుర్తు చేశారు. తెలంగాణ జాతీయ గీతం రాసిన అందెశ్రీది కూడా ఇదే జిల్లా అని ఆమె అన్నారు. ఈ జిల్లాతో వైఎస్‌కు చాలా అనుబంధం ఉందన్నారు. దికంతపల్లి ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం బాధాకరమని, వైఎస్ బతికుంటే పూర్తై, అభివృద్ధి పథంగా అడుగులు పడవేని అన్నారు. కాకతీయ యూనివర్శిటీకి ఇప్పటి వరకూ వీసీని కూడా ప్రభుత్వం నియమించలేదని, విద్యార్థులు నిలదీసినా, పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, వారి బలిదానాల వల్లే అధికారంలోకి వచ్చారని షర్మిళ గుర్తు చేశారు.













