వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. రూ.30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి తీసుకోవాలని షర్మిలకు న్యాయస్థానం షరతు విధించింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది. ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్సైని ఆమె వెనక్కి నెట్టారు. పోలీసులు నిలువరిస్తూ ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్ కాలిపైకి టైరు ఎక్కింది. బంజారాహిల్స్ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విదించారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.













