హైకోర్టు జోక్యంతో కదిలిన అంబులెన్స్‌లు

ఏపీ, తెలంగాణలో నిలిచిపోయిన అంబులెన్స్‌లు ఎట్టకేలకు కదిలాయి. అనుమతి లేదంటూ రెండు రోజుల నుంచి రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహంతో పోలీసులు అంబులెన్స్‌లకు అనుమతినిస్తున్నారు. దీంతో కరోనా రోగులు అత్యవసర చికిత్సమై హైదరాబాదుకు చేరుకుంటున్నారు. పోలీసులు అనుమతించడంతో ఎలాంటి అడ్డూ లేకుండా ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయన్న కారణంగా ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొన్ని జిల్లాల వారు వెనక్కి మళ్లిపోయారు. అంతేకాకుండా అంబులెన్స్‌ల సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే హైకోర్టు జోక్యం తర్వాత ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకొని, ఏపీ నుంచి హైదరాబాదుకు అంబులెన్స్‌లను పంపుతున్నారు. దీంతో కరోనా రోగులు ఊపిరి పీల్చుకున్నారు.