యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట ప్రధానాలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానర్చకుల బృందం విశిష్ట పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు స్వయంభు నారసింహుడి గర్భలయానికి ప్రవేశించి ఉత్సవాలను ప్రారంభించారు. ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా ఉత్సవమూర్తులను ఉంచి విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనము, రక్షబంధనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీత, అర్చక బృందం, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.













