నేటి నుంచి యాదాద్రీశుని బ్రహ్మూెత్సవాలు
పదకొండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మూెత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా బాలాలయంలోనే ఉత్సవాలు జరపాలని ఆలయ పాలకవర్గం నిర్ణయించింది. స్వామి తిరు కల్యాణం, రథోత్సవాలను ఈ సారి రెండు సార్లు నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా జరిగే అత్యంత విశేషమైన శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 24న ఆస్థాన పరంగా జరిగే కల్యాణోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని పట్టువస్త్రాలను అందజేస్తారు. అదే రోజు రాత్రి కొండ కింద నిర్వహించే కల్యాణంలో గవర్నర్ నరసింహాన్ దంపతులు పాల్గొంటారు. బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆలయ పునర్మిణ్మాణం దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు.













