అంగరంగ వైభవంగా యాదాద్రి బ్రహ్మూెత్సవాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మూెత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. బాలాలయంలో స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని అర్చకులు న్నులపండువగా నిర్వహించారు. వెండి గంగాళంలో పవిత్ర జలాలను పోసి స్వామి, అమ్మవార్లను చక్రస్నానం చేయించారు.
చక్రస్నాన మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చి తరించారు. వెండి గంగాళంలో పుష్కరిణి జలంతో లక్ష్మీసమేతుడైన యాదాద్రీశుడు స్నానమాచరిస్తున్న సమయంలో భక్తుల జయజయ హర్షధ్యానాల మధ్య బాలాలయం మార్మోగింది. యాదాద్రివాసా, యాదగిరీశా, గోవిందా గోవిందా అంటూ భక్తుల పారవశ్యంతో యాదాద్రి కొండ పెక్కటిల్లింది. అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మూెత్సవాలకు ముగింపు పలకనున్నారు.













