యాదాద్రి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం
లక్ష్మినరసింహస్వామి బ్రహ్మూెత్సవాలు యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఆది పూజలో భాగంగా అగ్నిని కొలుస్తూ ప్రతిష్ఠాపన చేపట్టారు. జల పూజ, ఆలయ శుద్ధి పర్వాలతో మొదలైన ఈ వేడుకలు మరో 10 రోజులు భక్తజనులను అలరించనున్నాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారమే ఉదయం 10 గంటలకు మొదలైన స్వస్తివాచనం 12 గంటలకు ముగిసింది. రాత్రివేళ మృత్తికా సంగ్రహణ క్రతువు నిర్వర్తించారు. పుట్ట మట్టిని తెచ్చి, మంత్ర పఠన సహితంగా నవధాన్యాలు నాటారు. విష్వక్సేర ఆరాధనతో మహోత్సవాలకు అంకురార్పణ జరిగినట్లు ఆలయ ప్రధాన పూజారులు ప్రకటించారు. తొలి పూజల్లో జిల్లా కల్టెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.













