26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణోత్సవ కల్యాణానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ సోమవారం యాదాద్రి ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రికలు అందించారు. బ్రహ్మోత్సవ కల్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందించారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 26నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి7వరకు అంగరంగ వైభవంగా 11రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో అత్యంత విశేషమైన స్వామివారి తిరుకల్యాణం మార్చి4న, దివ్య విమాన రథోత్సవం మార్చి5న ఘనంగా నిర్వహిస్తారు.













