మార్చి 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పదకొండు రోజుల పాటు కొనసాగనున్నాయి. సవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారం బాలాలయం నందు బ్రహ్మోత్సవాలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.గీత తెలిపారు. 10వ తేదీ రాత్రి 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 11వ తేదీ ఉదయం 11 గంటలకు స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం. 12వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారని ఏవో తెలిపారు. ఉత్సవాలన్నీ బాలాలయం నుందు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని తెలిపారు.













