ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో కన్హా శాంతివనం పేరుతో హార్ట్పుల్నెస్ సంస్థ నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధాన్యకేంద్రాన్ని, శ్రీరామచంద్రమిషన్ గ్లోబల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. యోగా గురు బాబారాందేవ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 40 వేల మంది అభ్యాసీలతో ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్, పతంజలి సంస్థలు కలిసి పనిచేసేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 30 ఎకరాల్లో ఉన్న ధ్యానకేంద్రంలో ఒకేసారి లక్షమందికిపైగా ధ్యానం చేసే అవకాశం ఉన్నది. కార్యక్రమంలో హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీరామచంద్రమిషన్ గురూజీ కమలేశ్ డీ పటేల్(దాజీ), ప్రతినిధులు సంజయ్, ఉమా శంకర్, వంశీ, కొటారీ పాల్గొన్నారు.













