వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి
తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ప్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన అనేక మంది యువకులు విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనికి సంబంధించిన వీసా లేక పోతే అక్కడి చట్టం ప్రకారం నేరమవుతుందన్నారు. యువకులు గల్ఫ్ ఏంజెట్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.













