ఇంటినుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలి
మహిళలకు ఇంటినుంచే పనిచేసే అవకాశాలను మరింత మెరుగుపరచాలని ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ అన్నారు. రెండో రోజు జీఈఎస్ ప్లీనరీ సమావేశాల్లో చందా కొచ్చార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలామంది మహిళలు కెరీర్ను వదులుకుంటారన్నారు. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కెరీర్ను వదులుకునే ఆలోచన చేయొద్దని మహిళలను ఆమె కోరారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపినప్పుడే ముందుకు వెళ్లగలమన్నారు. వృద్ధులు, పిల్లలను చూసుకుంటూ మహిళలు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు. సాంకేతికను వినియోగించి ఇంటినుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు విద్యావంతులైతే ఒక తరం మొత్తం విద్యావంతమైతదన్నారు.













