WTF: మహిళా ఫోరం కార్యక్రమాలు

మహిళా ఫోరం (women entrepreneurs) ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 4వ తేదీ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తెలుగు రత్నాలు… ఉమెన్ ఆఫ్ విజన్ అండ్ ఇంపాక్ట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్‌లలో రాణించిన మహిళల అనుభవాలు, సోషియల్ ప్రభావం ఇతర అంశాలతో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి డి. పురంధేశ్వరి ప్రారంభించనున్నారు. ప్యానలిస్ట్‌గా సుచిత్ర ఎల్లా వ్యవహరించనున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ మేనెజింగ్ డైరెక్టర్ సరోజ వివేకానంద్, జి. పుల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీవిద్యారెడ్డి, పంగియా ట్రేడ్ టీమ్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రైత మోచర్ల, టోయర్స్ గ్రూపు డైరెక్టర్ పద్మజ ఎర్రంసెట్టి ఇందులో పాల్గొననున్నారు.
సిఐఐ తెలంగాణ మాజీ చైర్ పర్సన్, ఎల్లికో లిమిటెడ్ వైస్ చైర్ పర్సన్ వనిత దాట్ల ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు.