తెలంగాణ రాష్ట్రంలో సంచలన ఘటన.. కదులుతున్న బస్సులో

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళలపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్థరాత్రి ఒంటి గంటలకు డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్ సమీపంలో బస్సును ఆపీ సీజ్ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ కృష్ణ ( ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ ఎన్.రాజేందర్ తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర షాక్‌కు గురైన బాధితురాలిని వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.