తెలంగాణ నుంచి రాహుల్ పోటీ!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే, ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఖమ్మం లేదా భువనగిరి నుంచి అగ్రనేత పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలి నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.