ఇది సిగ్గుపడాల్సిన విషయం : గుత్తా
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలు అని తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. తన అమ్మమ్మ కన్నుమూసిన విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే అమ్మమ్మ చనిపోయిన బాధలో తానుంటే కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం విస్మయం కలిగిస్తోందని జ్వాల తెలిపారు. కొవిడ్ తో చనిపోయిందా లేక చైనీస్ వైరస్ తో చనిపోయిందా? అని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. చైనీస్ వైరస్ తో కాదు, కొవిడ్ తోనే చనిపోయింది అని నేనెందుకు వీళ్లకు జవాబు చెపాల్పి? అని జ్వాల మండిపడ్డారు. మనం బతుకుతున్నది సమాజంలోనేనా? అలాగైతే సహనుభూతి ఎక్కడ? మనం ఎటువైపు పయనిస్తున్నాం? సిగ్గుపడాల్సిన విషయం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













