మంత్రి కేటీఆర్ తో వాట్సాప్ సీఈవో భేటీ
హైదరాబాద్‌లో వాట్సాప్ వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్ను కోరారు. హైదరాబాద్‌లో ఫేస్బుక్ పీపీడీ విభాగాధిపతి శివనాథ్ తుక్రల్తో కలిసి క్రిస్డేనియల్ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాట్సాప్, ఫేస్బుక్ కార్యకలాపాలపై చర్చించారు. వినియోగదారుల సేవా కేంద్రం ఏర్పాటుకు కేటీఆర్ చేసిన విజ్ఞప్తిపై వాట్సాప్ సీఈవో సానుకూలంగా స్పందించారని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ వాట్సాప్ పబ్లిక్ పాలసీ డివిజన్ ఇండియా హెడ్ శివనాథ్ థుక్రాల్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు.













