PV Sindhu: ఘనంగా పీవీ సింధు- సాయి వివాహ విందు

రాజకీయ క్రీడా, సినిమా రంగాలకు చెందిన అగ్ర తారలు అతిథులుగా విచ్చేయగా నవ దంపతులు పీవీ సింధు(P V Sindhu), వెంకట దత్త సాయి (Venkata Datta Sai ) ల వివాహ విందు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరై, కొత్త జీవితాన్ని ఆరంభించిన భార్యభర్తలను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ (Jishtudev Verma) , సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (Justice NV Ramana ) కూడా ఈ జంటకు ఆశీస్సులు అందించారు.
హారీష్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సుజనా చౌదరి, ఎంపీ జితేందర్ రెడ్డి, నటులు చిరంజీవి, నాగార్జున, అర్జున్, ఆలీ, మృణాల్ ఠాకూర్, అజిత్ -శాలిని దంపతులు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్మాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు గురుసాయి దత్, స్టార్ షట్లర్లు ప్రణయ్, చిరాగ్ శెట్టి, చాముండేశ్వరీనాథ్ ఈ వేడుకలో భాగమయ్యారు.