ఔరంగబాద్ లో పోటీ చేస్తాం.. పొత్తులపై ఇప్పుడే చెప్పలేం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగబాద్తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నామని, ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని తెలిపారు. ముస్లింలపై కొందరు ద్వేషభావాన్ని వ్యాప్తి చేస్తున్నారని, కానీ అలాంటి వారిపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ ప్రభుత్వం దేశ మంతా పాల్గొన్నదని, అల్వార్‌లో జరిగిన రాయల్ వెల్డింగ్‌లో పాల్గొన్నదని, కానీ జునైద్, నాసిర్‌లను చంపిన చోటుకు ఆ ప్రభుత్వం వెళ్లలేకపోయినట్లు ఆరోపించారు. తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, ఈ ఏడాది డిసెంబర్‌లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని ఓడిరచనున్నట్లు తెలిపారు.













