అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు.. ఈసారి మా ఆట మేం
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయం తర్వాత ఆలోచిస్తాం అని ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎమ్మెల్యే షకీల్, వారి అనుచరులు పై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఎంఐఎం కౌన్సిలర్‌ను నిజాంబాద్ జిల్లాలోని సారంగాపూర్ జైల్లో ఓవైసీ పరామర్శించారు. అనంతరం నిజామాబాద్‌లో ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము. మా స్కోర్ మేము చూసుకుంటాం. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తామని అన్నారు.అధికారం ఎప్పుడూ ఎవ్వరికి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. బోధన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌పై హత్యా యత్నం చేశారని మా ఎంఐఎం నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు.
బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కవిత షకీల్ కు కష్టపడి పనిచేసిన నాయకులపై ప్రస్తుతం అక్రమ కేసులు బనాయించి ఇరికించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బోధన్ నియోజకవర్గంలో జరగుతున్న అంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని భీమా వ్యక్తం చేశారు. అసలు నిజానికి బోధన్ నియోజకవర్గంలో ఎవరిపైన ఆరోపణలు వచ్చాయో వారిపై విచారణ జరపడం లేదని వాపోయారు.













