అమ్రపాలికి అరుదైన గౌరవం
వినాయక చవితి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కల్టెకర్ అమ్రపాలికి ఓ అరుదైన గౌరవం దక్కింది. అమె పనితీరుకు ముగ్ధులైన కొందరు యువకులు, ఏకంగా ప్రతిమను తయారుచేసిన వార్త వైరల్ అయింది. నవరాత్రుల సందర్భంగా ఖాజీపేటలోని బాపూజీనగర్‌లో ఏర్పాటు చేసిన మండపంలో కలెక్టర్ అమ్రపాలి ఒళ్లో వినాయకుడు కూర్చున్న ప్రతిమను ఉంచారు. విగ్రహానికి పూజలు చేశారు. మండపంలో ఉన్న అమ్రపాలి విగ్రహం ఫోటోలను హమారా వరంగల్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలకొద్దీ లైక్‌లు, వందలకొద్దీ షేర్లు వచ్చాయి. ట్రైసిటీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మండపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకమండపంలో ఒక కలెక్టర్ ప్రతిమకు చోటు కల్పించడం తెలుగురాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.













