వరంగల్ లో కన్వెన్షన్ సెంటర్

తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణం వరంగల్‍లో హైటెక్స్ (వరంగల్ హైటెక్స్) త్వరలో నిర్మాణం అవనుంది. మణికొండ సమీపంలోని ఐటీ పార్కు వద్ద త్రీస్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ (టీఎస్‍ఐఐసీ) అనుమతిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైటెక్స్ ఏర్పాటు కానుండడంపై జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‍లోని హైటెక్స్ తరహాలో వరంగల్ పట్టణం కూడా అభివృద్ధి చెందాలన్న ఓరుగల్లు వాసుల కలను మ్యుమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‍లు నెవేరుస్తున్నారని వారు పేర్కొన్నారు.