హైదరాబాద్ వైద్యునికి అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
ఈ నెల 13 నుంచి 15 వరకు తాష్కెంట్లో జరుగనున్న ఉజ్జెకిస్తాన్-భారత మెడికల్ ఫోరం సదస్సుకు హైదరాబాద్‌కు చెందిన అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డా. వ్యాకరణం నాగేశ్వర్రావు ప్రత్యేక ఆహ్వానం అందింది. తాష్కెంట్లో జరిగే ఈ సదస్సుకు డా. నాగేశ్వర్‌కు అలర్జీ, ఇమ్యునాలజీ విభాగాన్ని దక్షిణ భారతదేశంలో అతి అరుదైన నాణ్యమైన అత్యాధునికమైన సేవలు అందిస్తున్నారనీ, వీటి వల్ల వేలాది మందికి అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స విధానం అందిస్తున్న కారణంగా ఆహ్వానం పంపుతున్నట్లు ఉజ్జెకిస్తాన్ జాతీయ విద్యా శాఖ తెలిపింది. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం, వివిధ జాతీయ విశ్వవిద్యాలయాలు, వివిధ వైద్య రంగాలలో పేరు పొందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. డా. నాగేశ్వర్ నాయకత్వంలో అందిస్తున్న మెరుగైన ఎలర్జీ సేవలను వారి దేశంలో కూడా ప్రణాళికాబద్దమైన వైద్యుల ట్రైనింగ్ ప్రోగ్రాం, అత్యాధునిక చికిత్సా సేవా విభాగం తదితర మెడికల్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాలపై రానున్న రోజుల్లో కలిసి పనిచేయడానికి ఈ ఆహ్వానం పంపిస్తున్నట్లు ఉజ్జెకిస్తాన్ అంతర్జాతీయ వైద్య సంబంధాల ఇంచార్జ్ వైస్ రెక్టార్ లాజిసె తెలిపారు.













