అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు షాక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు ఓటమి తప్పలేదు. ఆరుగురు మంత్రులు ఓడిపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్‌పై తుమ్మల నాగేశ్వర్ రావు, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌పై ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డిపై తుడి మేఘా రెడ్డి, పాలకుర్తిలో దయాకర్ రావుపై యశస్విని రెడ్డి, మహబూబ్‌నగర్ లో శ్రీనివాస్ గౌడ్‌పై యెన్నం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. వీరిపై గెలిచిన వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్థులు కాగా, కేవలం నిర్మల్‌లో మాత్రమే మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరపున గెలిచారు.













