సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.













