ఇబ్రహీంపట్నం బరిలో విలాస్ రెడ్డి జంబుల
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసేందుకు న్యూజెర్సిలో ఉంటున్న విలాస్ రెడ్డి జంబుల ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన జంబుల రామచంద్రా రెడ్డి, అమ్మాయమ్మ దంపతుల రెండో సంతానం విలాస్‌రెడ్డి. మధ్యతరగతి కుటుంబం. బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహకరిం చేవారు. ఎన్ని కష్టాలుపడ్డా చదువులో మాత్రం వెనుకంజ వేయలేదు. మంచాల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు విలాస్‌రెడ్డి. అప్పట్లో ఎస్సెస్సీలో 459 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
దశాబ్దం క్రితమే విలాస్‌రెడ్డి స్థానికంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వగ్రామమైన మంచాల పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సా హకాలు అందించేవారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆయన క్విజ్, వ్యాస రచన పోటలను నిర్వహించేవారు. గెలుపాందిన విద్యార్థులకు ప్రోత్సాహకాలతోపాటు నగదు కూడా అందజేసే వారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నా తన సేవా కార్యక్రమాలను ఏనాడూ నిలిపివేయలేదు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ కాలుగా మెమోంటాలతో పాటు మొదటి, ద్వితీయ, స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 1000, 500 నగదు అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుపేదలను, వృద్ధులను ఆర్థికంగా ఆదుకుంటు న్నారు. వారి మౌలిక వసతుల కల్పన కోసం ఆయన వేలాది రూపాయలను వెచ్చిస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 15న అన్ని పాఠశాలకు చెందిన ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఉత్తమ ఉపాధ్యాయు లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. విలాస్‌రెడ్డికి భార్య చిత్రలేఖ, రిషిత కూతురు ఉన్నారు.
నా సంపాదనలో 30 శాతం వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు విలాస్ జంబుల పేర్కొన్నారు. 10 శాతం విద్యారంగం అభివృద్ధికి, 20 శాతం ట్రస్టులకు, వృద్దులకు, అనాథలకు వెచ్చిస్తుంటానని, కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడం తనకెంతో సంతృప్తిని ఇస్తుందని ఆయన చెబుతుంటారు.
విలాస్ రెడ్డి జంబుల భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. అమెరికాలో ఆఫ్ బిజెపి యుఎస్ఎ తరపున నిర్వహించే కార్యక్రమాల్లో కీలకపాత్రను ఆయన పోషిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో కూడా ఆయన చురుగ్గా పాల్గొని అధినాయకత్వం అభినందనలు అందు కున్నారు. బిజెపి తరపున ప్రచార కార్యక్రమాలను అమెరికా అంతటా కూడా చేస్తున్నారు.
కమ్యూనిటీ సర్వీస్‌లో…
అమెరికాలోని భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుండే విలాస్ జంబుల నిబద్ధత కలిగిన కమ్యూనిటీ లీడర్‌గా’ పేరు తెచ్చుకున్నాడు. స్వామి వివేకానంద స్ఫూర్తితో మంచి లక్షణాలను అందిపుచ్చు కున్న విలాస్ జంబుల తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్)లో స్టాండిరగ్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు. టీడిఎఫ్ యుఎస్ఎ ద్వారా తెలంగాణలో వివిధ కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించారు. అలాగే అమెరికా తెలుగు సంఘం (ఆటా)లో కూడా విలాస్ జంబుల చురుకైన పాత్రను పోషించారు. సోషల్ మీడియా స్టాండిరగ్ కమిటీ చైర్‌గా కూడా వ్యవహరించారు. న్యూజెర్సి, న్యూయార్క్ ప్రాంత సలహాదారునిగా ఆటా తరపున వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బిజెపి తరపున పోటీ చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఏమి చెప్పినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంటున్నారు.













