అలాంటి వారికే తెలంగాణలోకి అనుమతి…

ఆంధప్రదేశ్ రాష్ట్రం నుంచి వైద్య చికిత్సలకు హైదరాబాద్ వెళ్లే వారికి రాష్ట్ర పోలీసులు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కాని పక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‍కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందందన్నారు. ప్రైవేట్ అంబెలెన్స్లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఆంధప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కొవిడ్ అంబులెన్స్లను తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర చెక్‍పోస్టు ఏర్పాటు చేశారు. ఆంధప్రదేశ్ నుంచి వస్తున్న పెషేంట్లను తెలంగాణలోకి పోలీసులు అనుమతించడం లేదు. కొవిడ్ రోగులతో వెళ్తున్న అంబులెన్స్లను వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తాజాగా ఈ సూచనలు చేశారు.