రాములమ్మ సంచలన వ్యాఖ్యలు.. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై
తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీకి నిలబడుతామని బీజేపీ నాయకురాలు విజయశాంతి (రాములమ్మ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాకపోయినా, పార్టీ అదేశిస్తే అందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. తాను మొదటి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై దృష్టి పెడుతున్నానని, అయితే వచ్చే ఎన్నికల్లో తనను కామారెడ్డి నుంచి బండి సంజయ్‌ని గజ్వేల్ నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారని, అందులో సమస్య ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని, అందుకే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను కేసీఆర్‌పై పోటీ చేయాల్యని కార్యకర్తల అడగడంలో తప్పేమీ లేదన్నారు.













