బీజేపీకి మరో షాక్.. రాములమ్మ రాం రాం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సభ నిర్వహించినప్పటి నుంచి విజయశాంతి పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. విజయశాంతికి పోరాటల కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు ఇచ్చినా పార్టీ కార్యక్రమాలకూ దూరంగానే ఉంటుంన్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.













