కేసీఆర్ కొత్త నాటకాన్ని ఎవ్వరూ నమ్మరు…విజయశాంతి
కేంద్రం మీద నిందలు వేస్తూ రాజకీయ పబ్భం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా గొప్పలు చెప్పుకునే కేసీఆం ఇప్పుడు ప్రజలు అసహ్యించుకునే స్థితికి దిగజారడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తనను మరోసారి గెలిపించరన్న ఉద్దేశ్యంతోనే ఏమో ఇప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటించి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె విమర్శించారు.













