వైఎస్ఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గౌరవ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ నియమితులు కానున్నారు. వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) గౌరవ అధ్యక్షత పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ మంగళగిరిలో జరిగిన ఆ పార్టీ పీన్లరీ సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తన కుమారుడు జగన్ను అధికారంలోకి తీసుకురాగలిగానని అదే తరహాలో తెలంగాణలో షర్మిలను ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌరవ అధ్యక్షత పదవిని విజయమ్మ త్వరలోనే చేపడతానే ప్రచారం జరుగుతోంది.













