ఫైర్ బ్రాండ్ విజయశాంతికి బీజేపీ షాక్
ఫైర్ బ్రాండ్ విజయశాంతికి బీజేపీ షాక్ ఇచ్చింది. ఇంతకాలం స్టార్ క్యాంపెయినర్ గా గౌరవించిన ఆ పార్టీ తాజా ఎన్నికలలో ఆమెను దూరంగా పెట్టింది. ఇటీవల కాలంలో ఆమె పార్టీ కార్యకలపాలకు దూరంగా పెట్టడమే కారణమని భావిస్తున్నారు. ఇక 40 మందితో స్టార్ కాంపెయినర్ల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది.
తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చోటు కల్పించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీ ధర్ రావు, పొంగులేటి సుధాకర్ రావు, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేత పురంధేశ్వరిని నియమించింది.













