రాములమ్మకు చోటిచ్చారు
బీజేపీ విడుదల చేసిన స్టార్ కాంపెయినర్ల జాబితాపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మాజీ ఎంపీ విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావులను స్టార్ కాంపెయినర్లుగా పేర్కొంటూ ప్రత్యేకంగా జాబితా విడుదల చేయడం చర్చనీయాంశమయింది. 40 మందితో ముందుగా విడుదల చేసిన స్టార్ కాంపెయినర్ల జాబితాలో విజయశాంతి, దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు పేర్లు లేవు. అయితే ఈ ఇద్దరినీ స్టార్ కాంపెయినర్లుగా గుర్తిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. మొదట విడుదల చేసిన జాబితాలో రాములమ్మ పేరు లేకపోవడంతో ఆమె బీజేపీ రాం రాం చెప్పిందంటూ అంతా అనుకున్నారు. అయితే బీజేపీ వీడుతున్నట్లు ఆమె ఎలాంటి ప్రకటన చేసి ఉండకపోవడంతో పార్టీ అధిష్టానమే ఆమెను పక్కన బెట్టిందన్న చర్చ కూడా విస్తృతంగా సాగింది. ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగాక తీరిగ్గా విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ చేర్చడం ఆసక్తికరంగా మారింది.













