ఈటల రాజేందర్ కు విజయశాంతి కౌంటర్
ఇటీవల అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్కు కోవర్టులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఈటల వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ అటాక్ చేశారు. కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టండి అంటూ కామెంట్స్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే కేంద్రం వారిపై చర్యలు తీసుకుంటుంది. వారి గురించి నిజాలు బయటపెట్టండి. దీంతో, పార్టీకి మేలు చేసిన వారు అవుతారు అని ఈటల ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారిని పోలీసులకు అప్పగించాలి కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా ఈటలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.













