పాస్ పోర్టు కార్యాలయంలో విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాలు
సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఉద్యోగులందరి చేత సమగ్రత ప్రతిజ్ఞను చేయించారు. అలాగే ఈ ఏడాది థీమ్ అయిన సే నో టు కరప్షన్,కమిట్ టు ది నేషన్ గురించి వివరించారు. ఎక్కడా అవినీతికి చోటు లేకుండా ప్రజల కోసం పనిచేయాలని ఆయన సూచించారు. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.













