నేను రాజకీయంగా పెరిగింది.. ఎదిగింది.. ఒదిగింది తెలంగాణలోనే
నేను రాజకీయంగా పెరిగింది ఎదిగింది ఒదిగింది తెలంగాణాలోనే అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్భవన్లో ఆయనకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలంగాణ నేల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని అన్నారు. కేసీఆర్ ప్రసంగం విన్నాక కడుపు నిండిపోయిందని అన్నారు. తెలంగాణలో నాకు వీడదీయలేని అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్ బిర్యానీ, హలీం ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. ప్రపంచ అభివృద్ధి పటంలో హైదరాబాద్ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తిరిగానని చెప్పారు. తెలంగాణ సౌత్ ఆఫ్ నార్త్, నార్త్ ఆప్ సౌత్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయింది ఏ ఒక్కరి కోసం కోసం కాదు, అభివృద్ధి కోసం మాత్రమేనని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా ప్రపంచం దృష్టిలో తెలుగువారంతా ఒక్కటే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొరరు సహకరించుకుని అభివృద్ధిలో పోటీపడాలి అని ఆకాంక్షించారు. అభివృద్ధిలో సహకరించుకుంటే దేశంలోనే తెలుగు రాష్ట్రాలు ముందుంటాయన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే, దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మన అంతిమ లక్ష్యం దేశం అభివృద్ధి చెందడమేనని సృష్టం చేశారు.













