కరోనాపై ఓ నిర్ణయం తీసుకొని.. ప్రజల

తెలంగాణ రాష్ట్రంలో ఏం బాగుందో సీఎస్ సోమేశ్ కుమార్ చెబితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా, సీఎస్ మాత్రం లాక్‍డౌన్ అవసరం లేదంటున్నారని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదని, పడకలు కూడా దొరకడం లేదని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఏమాత్రం తగ్గడం లేదని, ఈ విషయం సీఎస్ గ్రహించాలని వీహెచ్ హితవు పలికారు. సీఎస్ వాస్తవాలను చెప్పాలని అన్నారు. ప్రజల ప్రాణాలు సర్కార్‍కు ముఖ్యం కాదా? అని ప్రశ్నించారు. కరోనాపై ఓ నిర్ణయం తీసుకొని, ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు.