Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Veteran congress leader and former mp d srinivas passes away at 76

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

  • Published By: techteam
  • June 29, 2024 / 07:39 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Veteran Congress Leader And Former Mp D Srinivas Passes Away At 76

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు.  డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 

Telugu Times Custom Ads

1948 సెప్టెంబర్‌ 27న జన్మించిన డీఎస్‌.. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్‌ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌  శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తులో క్రియాశాలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్‌తో కలిసి పనిచేశారు.  2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌తో విభేదించి, కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.  

డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. డీఎస్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం  ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్‌ మృతి పట్ల  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. డీఎస్‌ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో డీఎస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని  పేర్కొన్నారు. 
 

 

 

Tags
  • congress
  • D Srinivas
  • passes away
  • Telangana

Related News

  • Mahbubnagar A Meal With 101 Types Of Food Was Prepared For The Son In Law

    Dussehra : దసరా వేళ అల్లుడికి 100 రకాల వంటకాలతో విందు

  • Force Magazine Editor Praveen Sawhney Says India Should Reduce Dependence On America

    Praveen sawhney: అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి : ప్రవీణ్‌ సాహ్ని

  • Jagga Reddy At Dasara Celebrations In Sangareddy Announces Wife Nirmala Will Contest In Next Elections

    Jagga Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను

  • First Tesla Car Hits The Roads In Hyderabad

    Tesla car: హైదరాబాద్‌కు తొలి టెస్లా కారు!

  • Hyderabad Alai Balai Program Begins In Hyderabad

    Alai Balai : ఘనంగా  అలయ్‌ బలయ్‌ కార్యక్రమం… హాజరైన ప్రముఖులు

  • Hyderabad Union Minister Rajnath Singh Inaugurates Jeeto Content Exhibition

    Jeeto Content Exhibition : జీటో కనెన్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

Latest News
  • Amaravati:అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి
  • GCC: జీసీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు
  • Auto driver: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. వారికి ఏడాదికి రూ.15 వేలు!
  • Dussehra : దసరా వేళ అల్లుడికి 100 రకాల వంటకాలతో విందు
  • NATS: నాట్స్ అయోవా విభాగం తొలి క్రికెట్ లీగ్
  • NBK111: మ‌రోసారి డ్యూయెల్ రోల్ లో బాలయ్య‌?
  • Rashi Khanna: చీర‌క‌ట్టులో రాశీ ఒంపుల్ని చూశారా?
  • Rishab Shetty: ఒక్క షో ప‌డితే చాల‌నుకున్నా.. కానీ ఇప్పుడు
  • Nag Ashwin: ఆలియా ప్లేస్ లోకి సాయి ప‌ల్ల‌వి?
  • VD15: అక్టోబ‌ర్ రెండో వారంలో రౌడీ జ‌నార్ధ‌న
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer