అలా అయితే నేను రాజీనామా చేస్తా
రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి వరాలు కురిపిస్తారని విమర్శించారు. పీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడం శుభపరిణామం అని అన్నారు. అదే సమయంలో అద్దంకి దయాకర్ చిన్నపిల్లవాడని సెటైర్ చేశారు. అద్దంకి దయాకర్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని, మునుగోడు వ్యవహారం వాళ్లే చూసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు మునుగోడు వైపు పోనే పోనని, మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు ఎట్లా తెలుస్తుందన్నారు. మీడియా వెళ్లి సర్వే చేసిన మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు చెప్పాలన్నారు. మునుగోడు ఎన్నికలకు సెమీఫైనల్‌గా అభివర్ణించారు.













