కావాలని కోరుకోలేదు…వెంకయ్య
తానెన్నడూ పదవుల కోసం వెంట పడలేదని, పదవులు వద్దనుకోలేదని అలాగని తాను కావాలని కోరుకోలేదని ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించడం ఖాయమని ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నరేంద్రమోదీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. ఉప రాష్టప్రతి అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత నగరానికి తొలి సారి వచ్చిన వెంకయ్యనాయుడును పార్టీ నాయకులు అంతా మే ఫెయిర్ కనె్వన్షన్ సెంటర్లో ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తానెన్నడూ పదవుల కోసం వెంట పడలేదని, పదవులు వద్దనుకోలేదని అలాగని తాను కావాలని కోరుకోలేదని వ్యాఖ్యానించారు. 2019లో జరిగే ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నిక తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నానని, ఇదే విషయం తన కుటుంబ సభ్యులకు, ప్రధానికి కూడా చెప్పానని అన్నారు. ఏ బాధ్యతలో ఉన్నా తాను తెలుగు వారికి గర్వకారణంగా వ్యవహరిస్తానని చెప్పారు.













